...

2 views

"ది ఎఫైర్ - 9"
"ది ఎఫైర్ (ruins a human life) - 8" కి

కొనసాగింపు...

"ది ఎఫైర్ (ruins a human life) - 9"

ఆ లెటర్ అలా కంటిన్యూ చేసినా ఎస్ ఐ కి పక్క పేజీలో...
ఉన్న కంటెంట్ చదవడం ప్రారంభించాడు.

"సూసైడ్ నోట్ 2"

ప్రకాష్ ఫుల్ డీటెయిల్స్ ...
ప్రకాష్ ది పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం.
తండ్రి ఉరి వేసుకుని ప్రకాష్ చిన్నప్పుడే చనిపోయాడు.
అప్పటినుండి ప్రకాష్ మరియు వాళ్ల తమ్ముడిని కన్నతల్లే పెంచింది.

అదే ఊరిలో సెలవులకి వాళ్ళ అమ్మమ్మ గారింటికి వచ్చిన ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు ప్రకాష్ తన కామన్ ఫ్రండ్స్ ద్వారా...

అమ్మాయిలను బుట్టలో వేయడంలో నేర్పరయిన ప్రకాష్..
పరిచయమైన ఆ అమ్మాయితో మరింత చనువు పెంచుకున్నాడు. అలా ఆ పరిచయం కాస్తా స్నేహంగా , ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారి చివరికి అది వాళ్ళు శారీరకంగా దగ్గరయ్యే స్థితికి చేరింది.
అలా వాళ్ళిద్దరూ శారీరకంగా కలిసిన విషయం వాళ్ల అమ్మమ్మకి తెలిసి, ఆ అమ్మాయిని వాళ్ల ఊరు నుండి పంపించేసింది. విషయం ఆ అమ్మాయి ఇంట్లో కూడా తెలియడంతో, ఆమెకు వేరే అతన్ని ఇచ్చి పెళ్లి చేసేసారు.

పెళ్లి అయినా కూడా ప్రకాష్ ఆ అమ్మాయితో కొన్నాళ్ళు అక్రమ సంబంధం కొనసాగించాడు. కట్టుకున్న భర్తకు కూడా తెలియకుండా ఆ అమ్మాయి చాలా డబ్బులు ప్రకాష్ కి ఇచ్చేది. కొన్నాళ్లకు ఆ అమ్మాయిు భర్తకు విషయం తెలిసి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఇద్దరికీ.

తను భార్య దగ్గర తీసుకున్న డబ్బులు మొత్తం వెనక్కు ఇవ్వాలని ఆ అమ్మాయి భర్త గట్టిగా ప్రకాష్ ను నిలదీశాడు..
దాంతో భయపడ్డ ప్రకాష్, జాబ్లో జాయిన్ అయ్యి నెల నెలా కొంత అప్పు తీర్చేసాడు.
ఇక ఇంత జరిగాక ఆ అమ్మాయి దగ్గర ఆమె భర్త ఫోన్ లాగేసుకున్నాడు.
అప్పటి వరకు ఆ అమ్మాయితో సుఖం మరిగిన ప్రకాష్ ఆ ఎడబాటు భరించలేక తాగుడుకి అలవాటు పడ్డాడు.

కొన్నాళ్ళకి ఆ అమ్మాయి తన భర్తని ఒప్పించి, డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ కాలేజీలో జాయిన్ అయ్యింది. అక్కడే నా భార్య నాగమణి ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అయ్యారు.
ఇక ఆ అమ్మాయికి ఫోన్ లేకపోవడంతో నా భార్య వద్ద ఫోన్ తీసుకుని ఆ అమ్మాయి ప్రకాష్ తో రహస్యంగా మాట్లాడేది.

కొన్ని రోజులు చూసీ చూడనట్టు వదిలేసిన నా భార్య...
ఒకరోజు "ఫోన్లో ఎవరు అక్క.. బావ గారా?" అని అడిగితే,

"కాదు, పెళ్లికి ముందు నేను  ప్రేమించిన వ్యక్తి !
చాలా మంచివాడు. మా ప్రేమ విషయం మా ఇంట్లో తెలిసి నాకు బలవంతంగా పెళ్ళి చేయడంతో.. నన్ను మర్చిపోలేక  తాగుడికి అలవాటుపడ్డాడు. నా జ్ఞాపకాలతో జీవిస్తూ పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయాడు." అంటూ నాగమణికి తన ప్రేమ గురించి సవివరంగా వివరించి చెప్పింది ఆ అమ్మాయి.

అప్పటికి టీనేజ్లో ఉన్న నాగమణి కి, ఆ అమ్మాయి మాటలతో ప్రకాష్ పై జాలి కలిగింది. తన ఫోన్లో అతడి నెంబర్ సేవ్ చేసుకుని అప్పుడప్పుడు ప్రకాష్ తో మాట్లాడుతూ బాధలో ఉన్నాడనుకున్న అతనిని ఒదార్చేది నాగమణి.

అలా ప్రకాష్ తో పరిచయం పెరిగింది నా...