...

1 views

"శ్రీ కృష్ణ మహా భారతం -57"
"శ్రీ కృష్ణ మహా భారతం - 56" కి

కొనసాగింపు...

"శ్రీ కృష్ణ మహా భారతం - 57"

వారణా వర్తమ్ లో పాండవుల కోసం నిర్మించిన గృహంలో అందరూ ఆ రాత్రి నిద్ర పోతూ ఉంటారు. ఇంతలో భీముడు మెల్లగా నకులుడు నిద్రిస్తున్న పడక ప్రదేశానికి వచ్చి, అతడిని మెల్కొల్పుతాడు.

ఈ సమయంలో తనని నిద్ర లేపడానికి కారణాన్ని నకులుడు అడగ్గా...
"నాకు బాగా ఆకలిగా ఉంది. ఇక్కడ భోజనశాల ఎక్కడుందో నాకు తెలియడం లేదు. అందులో సహాయపడతావ్ అని ఇలా నిన్ను నిద్ర లేపాను నకులా..!" అంటూ సమాధానం ఇస్తాడు.

ఈ సంభాషణ అంతా రహస్యం పురోచనుడు వింటాడు.

"దానికి ఒకసారి ఒక పరిచాలకుడు పరిష్కారం చెప్పాడు కదా..!
అదే, వంటకాల వాసనతో వంట శాలను సులభంగా గుర్తించవచ్చని, కాబట్టి ఇప్పుడు నీ నాశికానికి పని చెప్పు బ్రాతా భీమా !" అంటూ నకులుడు అక్కడి నుండి మెల్లగా జారుకుంటుంటే,

"ఆగాగు నకులా..!
ఆ పని కూడా అయ్యింది. కానీ ఉపయోగం లేదు. అందుకే నీ సలహా కోరి, నిన్ను తీసుకొచ్చాను. ఏదైనా ఉపాయం చెప్పు నకులా" అంటూ భీముడు నకులుడిని అడుగుతాడు.

దానికి నకులుడు..
"ద్వార పాలకుడిని అడిగితే, అతడు చెప్తాడు కదా..!" అంటూ సమాధానం ఇస్తాడు.

అప్పుడు భీముడు
"ద్వారపాలకా..!
ద్వార పాలకా..!!" అంటూ గట్టిగా అరుస్తూ అతడిని పిలుస్తాడు.

ద్వారపాలకుడు రాగానే,
భీముడు...
"ఈ భవనంలో వంటశాల ఎక్కడుంది" అని అడుగుతాడు.

దానికి ద్వారపాలకుడు...
"ఇక్కడ అసలు వంటశాల లేదు యువరాజ..!
వంటశాల ఈ భవనానికి వెలుపల ఉంది" అంటూ సమాధానం ఇస్తాడు.

ద్వారపాలకుడి ఆ సమాధానానికి నకులుడు, భీముడు ఇద్దరూ ఖంగుతింటారు.

అంతలోనే అక్కడికి పురోచనడు...
పళ్ళు, స్వీట్స్, ఇంకొన్ని తినుబండారాలతో అక్కడకి వస్తారు.

"మీరు ఆకలికి తట్టుకోలేరన్న విషయం మాకు తెలిసి కూడా మీకు తగిన ఏర్పాట్లు చేయడం మర్చిపోయాము.
అందుకు మమ్మల్ని క్షమించండి భీమా..!
ఇదిగో ఇవి మీకోసమే తీసుకుని వచ్చాము. దయచేసి స్వీకరించండి" అంటూ తనతో తెచ్చిన పళ్లూ ఫలహారాలు భీముడికి ఇస్తుంటే,

అసలే ఆకలి మీదున్న భీముడు వాటిని వెంటనే తీసుకుని ఆరగించే పనిలో పడతాడు.

నకులుడు మాత్రం...
"కానీ, ఇంత పెద్ద భవనంలో వంటశాలను ఏర్పాటు చేయకపోవడం ఏంటి పురోచనా..!" అంటూ ప్రశ్నిస్తాడు.

దానికి పురోచనుడు...
"అదీ...
అదీ..." అంటూ తడబడుతూ...
"వంట చేసే దాసిలంతా భవనానికి వెలుపలే ఉంటారు. వాళ్ళతో మీకు ఏ అసౌకర్యం కలగకుండా ఉండడానికి అలా చేశాను" అంటూ పొంతనలేని సమాధానం ఇస్తాడు.

"దాసిలతో మాకు అసౌకర్యమా..!
ఏం మాట్లాడుతున్నావ్ పురోచనా..!
మా రాజ్యంలో అన్ని భవనాలలో వంటశాల లోపలే ఉంటుంది. అక్కడ ఎక్కడా కలగని అసౌకర్యం ఇక్కడ కలుగుతుందని నువ్వు ఎలా అనుకుంటున్నావ్ ? " అంటూ నకులుడు అతడిని ఎదురు ప్రశ్నిస్తాడు.

భీముడు కూడా (తెచ్చిన ఫలహారాలు తింటూనే) ..
"అవునవును..!
నకులుడు సత్యం పలికాడు.
అక్కడ ఎక్కడా లేని అసౌకర్యం ఇక్కడ ఎందుకు కలుగుతుంది. రేపటి కల్లా వంటశాలను  భవనం లోపలే నిర్మించడానికి ఏర్పాట్లు చేయించండి. ఇది నా...