...

1 views

"ది ఎఫైర్ - 4"
"ది ఎఫైర్ (ruins a human life) - 3" కి

కొనసాగింపు...

"ది ఎఫైర్ (ruins a human life) - 4"


కొన్ని రోజుల తర్వాత...
ఆ కానిస్టేబుల్స్ హోటల్ కి వచ్చి ఆ అజ్ఞాత మహిళ యొక్క వివరాల కోసం ఆరా తీశారు ఆ హోటల్ మేనేజర్ ని.

అప్పుడు ఆ హోటల్ మేనేజర్...
"సారీ సార్..!
ఆ డిటైల్స్ కోసం ఎంత ట్రై చేసినా మాకు దొరకలేదు.
ఇక నుండి క్రమం తప్పకుండా
ప్రతి క్షణం ఎవరెవరు హోటల్ కి వచ్చి వెళ్తున్నారో ప్రతీది నోట్ చేస్తాం. దయచేసి ఈ ఒక్కసారికి జరిగిన తప్పుని మన్నించి, మమ్మల్ని అర్థం చేసుకోండి సార్.
ఈ ఒక్కసారికి ప్లీజ్ !"
అంటూ కానిస్టేబుల్స్ నీ ప్రాధేయపడ్డాడు.

కానిస్టేబుల్స్ కూడా చేసేదేం లేక,
ఆ మేనేజర్ ని నాలుగు తిట్లు తిట్టి అక్కడి నుండి వెళ్తూ వెళ్తూ...
"ఏవైనా అవసరం ఉంటే, స్టేషన్ కి పిలుస్తాం, వచ్చి కనిపించి వెళ్తూ ఉండూ..!"
అంటూ కోపంగా వెళ్ళిపోయారు.

అదే విషయం వాళ్లు ఆ ఎస్ ఐ కి చెప్పగా...
ఇక ఎస్ ఐ కి కూడా ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావడం లేదు. దానికోసం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు అక్కడే స్టేషన్ లోనీ తన రూంలో...

కొద్దిసేపటి తర్వాత శ్రీనివాస్ ని పిలిచి,
"శ్రీనివాస్...
మీరు ఎంక్వైరీ కోసం శివరాం ఇంటికి వెళ్ళినప్పుడు...
అక్కడ ఒక పెద్దాయనా మీకు ఇంకేదో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని అన్నారు, అదే శివరాం లేనప్పుడు అతని భార్యని కలవడానికి ఎవరో అజ్ఞాత వ్యక్తి వస్తున్నట్టు...!

ఇప్పుడొక సారి అతన్ని పిలిపిస్తే?
మరిన్ని వివరాలు లభించొచ్చేమో ?" అంటూ అడగ్గా...

శ్రీనివాస్ ...
"సార్ అది...!
అది...!" అంటూ నాన్చుతున్నాడు.

"ఎందుకు శ్రీనివాస్ అంతలా సంకొచిస్తున్నావ్ !
ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నావ్ ?
అసలు ఏం జరిగింది శ్రీనివాస్ ?" అంటూ ఎస్ ఐ అడుగుతాడు.

అప్పుడు శ్రీనివాస్...
"ఏం లేదు సార్..!
ఆ ముసలాయన ఈ వయసులో స్టేషన్ కి రాలేనని, ఊరిలో నలుగురికి తెలిస్తే, మళ్ళీ అతని పెద్దరికం పోతుందని భయపడుతున్నాడు.

తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకూ తీసుకుని, అతన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దని, మాకు ఈ డిటైల్స్ చెప్పినప్పుడు వేడుకున్నాడు. పోనీలే పెద్దాయన ఇంతగా ప్రాధేయపడుతున్నాడని మేము కూడా దానికి సరే అన్నాం.

వీలైతే ఎవరికి తెలియకుండా అతని దగ్గరికే వెళ్లి విచారిస్తామని సర్ది చెప్పి వచ్చాం. అందుకే, ఇప్పుడు మీకు ఈ విషయం ఎలా చెప్పాలా ?
అని ఆలోచిస్తూ...!
కానీ ఎలా చెప్పాలో తెలియక ...? " అంటూ జరిగింది చెప్తుండగా..

"ఓహ్ ఇంతేకదా..!
ఈ విషయం చెప్పడానికి ఇంత సేపు ఆలోచించాలా ?
సరే, నువ్వు అతనికి చెప్పినట్టుగానే...