...

9 views

అడవి గుర్రం ( రెండవ భాగము )
( అడవి గుర్రం మొదటి భాగం చదివిన తరువాతే ఈ భాగము ను చదవాలి )

ఆ మరుసటి రోజు దనుంజయ్ రాజు సంజయ్ రాజును కలవడానికి వెళ్ళాడు. దనుంజయ్ రాజును సుస్వాగతం పలికాడు. దనుంజయ్ రాజు సంజయ్ రాజు తో గుర్రాన్ని దుండగులు అపహరించిన సంగతి చెప్పాడు మరియు త్వరలో ఆ గుర్రాన్ని మా సేనతో వెతికించి తీసుకొచ్చి మీకు సమర్పిస్తానని తెలియజేసాడు. దానికి సంజయ్ రాజు 'వద్దు మహారాజా! ఆ గుర్రాన్ని వెతికే భాద్యత నా కొడుకు సిద్దార్థుడికి ఇవ్వండి. ఎందుకంటే అతడు ఈ పని మీద ఎంత ఓర్పు గా, సహనం గా ఉంటాడో తెలుసుకోవాలని ఉంది అని సంజయ్ రాజు అన్నాడు.
మహారాజా! ఆ గుర్రం ఎలా ఉంటుందో కాస్తా చప్తారా? ఆ గుర్రాన్ని చూసి చాలా కాలం అయింది? అందుకు గుర్తుపట్టడానికి ఎదైనా ఆచూకి ఉంటే చెప్పండి? అని వివరాలు అడిగాడు సంజయ్ రాజు. "ఆ గుర్రం మెడకి రాగి హారం ఉంటుంది. దాని పై రెక్కల గుర్రం ఎగురునట్లు ముద్ర ఉంటుంది. శరీరం అంతా నల్లగా ఉంటుంది . కుడి కాలికి కొంచెము తెలుపు రంగు ఉంది. ఇదే నాకు తెలిసిన ఆచూకి" అని దనుంజయ్ రాజు ఆ రాజు దగ్గర నుండి సెలవు తీసుకున్నాడు.
ఆ రోజు సాయంత్రం సంజయ్ మహారాజు కుమారుడు సిద్దార్థుడికి పిలిచి దనుంజయ్ రాజు చెప్పిన విషయం చెప్పాడు. తాను సిద్దార్థుడికి గుర్రాన్ని వెతికే భాద్యతను అప్పగించాడు. ఆ విషయం అంతా చెప్పిన తరువాత. నువ్వు గుర్రాన్ని వెతకడానికి సిద్దంగా ఉన్నావా? అని సిద్దార్థుడికి ప్రశ్నించాడు. "తప్పకుండా నాన్నగారు మీరేదంటె అది" అని సిద్దార్థుడు సమాధానం ఇచ్చాడు. నీతోపాటు నీ మిత్రులకు కూడా తీసికొని వెళ్లు. ఎందుకంటే ఒంటరిగా వెళ్లటం అంత మంచిది కాదు " అని సంజయ్ రాజు అన్నాడు. దానికి సరేనన్నాడు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రేపు వెళ్లడానికి సిద్ధపడ్డారు.
ఆ తరువాత రోజు సిద్దార్థునితో రూబి
, హరిత, రవికాంత్, కాళిదాస్ వీళైదుగురు మిత్రులు ప్రయాణానికి సిద్దమైయ్యారు. అన్ని సిద్దం చేసి వారి వారి గుర్రాల పై కలసికట్టుగా బయలుదేరారు. కనిష్కా రాజ్యము చుట్టుపక్కల ఐదు రాజ్యలు వున్నాయి. ఈ ఐదు రాజ్యలలో ఎక్కడో ఒక దగ్గర ఆ గుర్రం ఉంటుందని సిద్దార్థుని అంచనా. కలసికట్టుగా రెండు రాజ్యాలు తిరిగి గుర్రాన్ని వెతికేసారు. మిగిలినవి ముాడు రాజ్యాలు అవి. గాబన్ సామ్రాజ్యం, హర్షతేజ సామ్రాజ్యం, దందికోట సామ్రాజ్యం. గాబన్ సామ్రాజ్యం లో వెతకడానికి వెళ్ళారు.
అక్కడ నుండి కొందరు దుండగులు వెంబడిస్తున్నట్లుగా సిద్దార్థుడికి అనుమానం వచ్చింది. సిద్దార్థుడు తనవాళ్లందరిని అప్రమత్తం చేసాడు. అలా చెయ్యడం తో దుండగులు వాళ్ళ పై దాడికి దిగారు. అప్పుడు సిద్దార్థుడు ఏ మాత్రం ఆలోచించకుండా వాళ్ళ పై బాణాలు వేసాడు. వాళ్ళ మిత్రులు కూడా వాళ్ళ తో పోరాడారు. ఆ దుండగులను తాడుతో కట్టి చెట్టు కు తలకిందులుగా వేలాడదీసాడు. వేగంగా అక్కడ నుంచి కదిలారు. "సోదరా ! మన ప్రయాణము ఈ రోజు తో 50 దినాలు. ఇది వర్షాకాలం నేను ఈ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాను. నా ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదు. దయ చేసి ఇక్కడ నుంచి వెళ్లిపోవడానికి అనుమతి ఇవ్వు" అని రవికాంత్ సిద్దారునికి అనుమతి అడిగాడు. సరే నీకు తోడుగా కాళిదాసు ని తోడుగా తీసుకెళ్లి అని అన్నాడు సిద్దార్థుడు. వాళ్లిద్దరూ వెళిపోయారు.
రూబి, సిద్దార్థ, హరిత వీళ్ల ముగ్గురే వున్నారు. వాళ్లు రెండు రాజ్యాలు వెతికేసారు. మిగిలినది హర్షతేజ సామ్రాజ్యం. హర్షతేజ రాజ్యం దగ్గర ఒక అడవి ప్రాంతం లో రాత్రి కి బస చేసారు. దానికి దిగువున ఒక సెలయేరు ఉంది. చూడటానికి చాలా బాగుంటుంది. అయితే ఆ రోజు రాత్రి వాళ్లు చాలా కబుర్లు చెప్పుకున్నారు. రేపు కచ్చితంగా ఆ గుర్రం దొరుకుతుందనే నమ్మకం ఉంది. అర్ధరాత్రివేళ సిద్దార్థుడికి దాహం వేసి సెలయేరు దగ్గర కు వెళ్లి దాహం తీర్చుకొని వచ్చినప్పుడు వాళ్ల స్నేహితులిద్దరు కనిపించలేదు. ఎక్కడికి వెళ్లిపోయారు అసలు . అరే వాళ్ల గుర్రాలు కూడా లేవు? అని ఆలోచించాడు. ఆ ప్రాంతమంతా వెతికాడు కనిపించలేదు.

( ఇంకా ఉంది.. చివరి భాగంలో )