సమ్మోహిత
© bhanu_buddi
Note :- స్టోరీ ప్రెసెంట్ డేస్ లో ఆడవారి పై జరిగే అకృత్యాలు
మీద రాస్తున్న స్టోరీ, ఆడవారు పడుతున్న బాధలు, ఆడవారికి జరిగే అన్యాయాలకి మన సమాజం లో న్యాయం అనేదే జరగడం లేదు, అది మైండ్ లో పెట్టుకుని రాస్తున్న స్టోరీ ఇది, నిత్యం జరిగే వాటి మీద రాస్తున్న ఎవరన్నా సున్నిత మనస్కులు, లేదా ఆడవారిపై జరిగేవి మాకెందుకు అనుకునే వారు ఉంటే.., ఇప్పుడే చదవడం ఆపేయ్యండి..!
అలాగే చదివేది మగవారు అయితే.., నేను ఎవ్వరిని ఉద్దేశించి రాయడం లేదు.. పాలు తాగే చిన్నారులనుంచి, ముసలవ్వ దాక జరిగే వాటిమీద రాస్తున్నాను.., దయచేసి అర్ధం చేసుకోగలరు..!
ఈ స్టోరీ లో వాడే పదలు మీ మనస్సుని బాధపెడితే దయచేసి నాకు తెలియచేయ్యండి..!
సమాజం లో జరిగే వాటిమీద విసిగిపోయి ఉంటే ఈ స్టోరీ తప్పక చదవండి, real లైఫ్ లో పడని శిక్ష ని.., మన ఈ స్టోరీ ద్వారా అమలు చేద్దాం..!
ఇప్పటికి మీకు స్టోరీ చదవాలి అనిపిస్తే.., మీరు సమాజం కోసం ఆలోచిస్తున్నరు.., మీకు హాట్స్ఆఫ్... 🙏
ఇంకా స్టోరీ లోకి..
సమయం సరిగ్గా రాత్రి 12 గంటలు.., స్థలం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర ...., హ్యాపీ బర్త్ డే డాడీ... అంటు గట్టిగా అరుస్తూ ... ఆనందం తో పార్టీ బ్లాస్ట్ బ్లాస్ట్ చేసి..., తన తమ్ముడు హ్యాండ్ లో ఉన్న కేక్ తీసుకొని..., కార్ బెనెట్ పై పెట్టి..., కార్ లో సిగ్గుతో విండో నుంచి చూస్తు కూర్చున్న..., ఆవిడని..,
అమ్మా రా...... అలా ఎంత సేపు కార్ లోనే కూర్చుంటావ్..., అమ్మ.., మీ ఆయనకి బర్త్ డే విష్ చెప్పవా... రా అమ్మ కేక్ కుడా కరిగిపోయేలా ఉంది అంటూ.. హడావిడి చేస్తున్న.., కూతురిని చూస్తు ..., సిగ్గుతో ఆమె ఇలా అంటుంది....ఎలా రానే వద్దు వద్దు అన్నా వినకుండా ఈ డ్రెస్ వేసుకునే వరకు ఊరుకోలేదు..., ఎవరన్నా చూస్తే..,
అమ్మ మాటలకి చిన్నగా నవ్వుతూ చిరు కోపాన్ని ప్రదర్శిస్తూ... రెండు చేతులు నడుము మీద పెట్టుకుని..., హ చూస్తే..., పిల్ల కన్న తల్లి కేకలా ఉంది అంటారు అంటూ నవ్వుతున్న కూతురిని చూసి..., అవేం మాటలే... నీకు మరి అల్లరి ఎక్కువ అయిపోయింది....
మరి లేకపోతే ఏంటి అమ్మ... నువ్వు వేసుకుంది జస్ట్ చుడిదార్..., ఏదో వన్ పీస్ డ్రెస్ వేసుకున్నట్లు ఓ... తెగ సిగ్గు పడుతున్నావ్...,
నీకన్నా పెద్ద వాళ్ళు కూడా ఇప్పుడు డ్రెస్లు వేసుకుంటున్నారు... మోడరన్ డ్రెస్లు వేసుకొని చక్కగా తిరుగుతున్నారు..., నువ్వు ఒంటి నిండా డ్రెస్ వేసుకొని కూడా అంత సిగ్గు...