...

2 Reads

చెప్పేది సైన్స్యే నన్ను నడిపించే మంత్రం
కానీ దేశాన్ని విమర్శించడమే వాళ్ళ ఆస్త్రం
పేదరికాన్ని నిర్మూలించడమే వారి లక్ష్యం
కానీ అభివృద్ధిని ఓర్వలేకపోవడం వారి నైజం
వాళ్లకి వచ్చింది ఇంట్లో కూర్చొని కామెంట్స్ చేయడం
ఎంత కష్టపడితే చందమామ చేరింది నా త్రివర్ణ పతాకం
వీళ్ళు వాడే చరవాని పైకం అధికం
డబ్బా ఫోను వాడి పేదలకి ఒక్కరోజైనా పెట్టొచ్చు అన్నం
రాకేస్ట్స్ ఎగరేస్తే వస్తుందా పేదలకి సుఖం
అంటే టెక్నాలజీలో మన దేశం ముందుకు పోవడం అనవసరం
తర్వాత నువ్వే అంటావ్ ఏం సాధించింది ఈ దేశం
అనుభవిస్తున్నవ్ పాచ్చత్య దేశాల ప్రతిఫలం
మనసు నిండా నింపుకోవాలి విద్వేషం
మంచి పై కూడా చింమాలి విషం
అదే కదా నువ్వు పెట్టుకున్న ఎజెండా తత్వం
ఇంకెందుకు కోరుకుంటావ్ దేశం బాగు పడటం