...

2 Reads

విమర్శ చేయడం తప్పు కాదు కానీ
మంచిని కూడా స్వాగతించే మనిషి వారు అయినప్పుడు
లోపాన్ని ఎత్తి చూపడం తప్పు కాదు కానీ
ఆ లోపాన్ని ఎలా పరిష్కరించాలో వారికి తెలిసినప్పుడు
నాకే అంతా తెల్సు అనుకోవడం తప్పు కాదు కానీ
ఎదుటి వారికి ఏం తెలియదు అనుకున్నంత వరకు
నేను చెప్పిన ప్రతిదీ మంచే అనుకోవడం తప్పు కాదు
కానీ నీ జీవితంలో ఎప్పుడూ చెడును పకలనంత వరకు
సమాజాన్ని మార్చాలి అనుకోవడం తప్పు కాదు
కానీ ఆ మార్పే మంచి మార్గదర్శిగా నిలిచినంతవరకు
ప్రతి వ్యక్తిని నమ్మడం తప్పు కాదు
కానీ ఆ వ్యక్తి అసలు రూపం తెలియనంత వరకు
నీ స్వేచ్ఛను ప్రకటించడం తప్పు కాదు కానీ అది ఇతరులను కించపరచనంత వరకు
నీ రాతలు రాయడం తప్పు కాదు కానీ దానితో అసత్యం వ్యాపించనంత వరకు