...

1 Reads

ఆమే ఓ ఆదర్శం అవనికి అడుగడుగున
ఆమే ఓ నిదర్శనం ఓర్పుకి ప్రతి గృహమున
ఆమే ఓ చైతన్యం నలుమూలల వెతికినా
ఆమే ఓ అద్భుతం మాతృత్వపు రుపానా
ఆమే ఓ మధురం జోల పాడినా
ఆమే ఓ అపురూపం సోదరి భావమున
ఆమే ఓ నిర్వచనం స్వఛ్చమైన ప్రేమమున
ఆమే ఓ అమృతం తల్లి పాల తనువున
ఆమే ఓ కెరటం అవకశాలు అందుకొనగ
ఆమే ఓ శిఖరం సాటి లేరు విశ్వమున
ఆమే ఓ సందేశం కష్టాలను ఎదుర్కొనగా
ఆమే ఓ అనంతం విశ్వానికి కారిణిగా
ఆమే ఓ ప్రశాంతం అమ్మ ఓడిన పడుకొనిన
ఆమే ఓ అదృష్టం ప్రతి భర్త విజయమున
ఆమే ఓ ఆకాశం అందని ఎత్తులో వెలిగిన
ఆమే ఓ సముద్రం
లావాలా బాధను దాచిన
ఆమే ఓ ఆయుధం అసాధ్యాలు చేదించగా
ఆమే ఓ విజయం అన్నిటినీ సాధించగా
ఆమే ఓ మూలం జగతిని రక్షించగా

#rkthoughts #telugu_quotes #womensday #motherlove❤️