...

5 views

నీతోనే నేనుంటా
నిశీధి రాత్రిలో వెన్నెలవయినావు...
చీకటి కన్నుల వెలుగయినావు
మనసు కోటలో అడుగడుగునా తోడైనావు
వెల్లే దారి తెలియదన్నావు..
మనసుకు గాయం చేసినావు,
మాటలతో మురిపించినావు.
స్నేహ హస్తాన్ని అందించినావు,
కష్టాల కడలి ఒడ్డున ఇసుకతో
కట్టినాను ఆశల సౌధాన్ని..
కడలి అలలు తాకుతాయేమో అని అరచేయిని అడ్డుపెట్టినాను..
చేయిలో చేయి వేసి నా
ఆశలను నిలపెడతావో,
అలల అలజడితో అలిసిన
అరచేయిని అలాగే వదిలేస్తావో.
మరణంతోనే మరుపన్నావు..
మరణించినా మరచిపోలేని ప్రేమను నేను
కనిపించని చెరసాలలో యావజ్జీవశిక్ష అనుభవించేవాళ్ళకు తప్ప అర్థం కాదు.
నువ్వు నాతో ఉంటే నేను చాలా అదృష్టవంతుడినట.
లేదంటే అంతా నాతలరాతేనట...
నాతలరాత రాసేది బ్రహ్మ కాదు నువ్వేగా
© Dinesh muddada