...

6 views

ఇల్లాలి అందం
సూర్యుడి కన్నా ముందే తెరుచుకొనే
తన కనులు ఓ అందం,

కల్లాపి చల్లి ముగ్గు పెట్టే
తన చేతిలో అందం,

వెతికి నిండా బొట్టు ధరించే
తన పాపిట సింధూరం ఓ అందం,

ఇంట్లో అందరి కోసం పరుగులు తీసే
తన పట్టీల సవ్వడి ఓ అందం,

అందరి కడుపు నింపడానికి వంట చేసే
తన గాజుల సవ్వడి ఓ అందం,

కడపను కడిగిన
తన అరచేతికి అంటిన పసుపు ఓ అందం,

పిల్లల అల్లరిని ఇష్టంగా భరించే
తన సహనం ఓ అందం,

ఇంటి బంధాలు లాగా అల్లుకున్న
తన జడ ఓ అందం,

భర్త వెంట ముళ్ళ దారి అయినా, పూల దారి అయినా ప్రేమగా అడుగులు వేసి
తన పాదాలది ఓ అందం,

ఇంతటి బాధలున్నా
తన పెదాలపై చెరగని చిరునవ్వు అందం,

ఎక్కడో పుట్టి మెట్టింట అందరితో కలిసి పోయే
తన ఔన్నత్యం ఓ అందం,

దేవుడి ముందు వెలుగుతున్న దీపం కాంతి
అంత అందం ఇల్లాలి అందం .



© sravani writtings