మగువా నీకు వందనం 🙏
© sravani writtings
ఆడదిగా పుట్టడం ఒక అదృష్టం,
ఆమెకు జన్మనివ్వడం ఎన్నో జన్మల పుణ్యం .
ఆడది ! నీ ఇంటి గడపకు ఉన్న పసుపు,
ఆడది! నీ ఇంట్లో వెలుగుతున్న దీపపు కాంతి,
ఆడది! మీ ఇంట్లో పనుల కోసం కదలాడుతున్న గాజుల శబ్దం,
ఆడది ! ఇంట్లో అందరి కోసం పరుగులు తీసే మువ్వల సవ్వడి...
ఆడది! పుట్టినప్పుడు తండ్రి కళ్ళల్లో నుంచి వచ్చిన ఆనంద భాష్పాలే, కన్యాదానంలో కన్నీరుగా మారుతాయి.
ఆడది ! తండ్రి గౌరవాన్ని వాడి బియ్యం లా వడిలో కట్టుకొని పుట్టింటి గడప దాటి మెట్టింటి గుమ్మంలో అడుగుపెడుతుంది.
ఆడది! మగాడు కట్టిన మూడు మాసాల పుస్తెను 80 ఏళ్ళు మొయ్యడం కోసం ,తన 20 ఏళ్ల జీవితాన్ని తృణప్రాయంగా వదిలేస్తుంది.
ఆడది! తను పుట్టి పెరిగిన పుట్టింట్లో తను కోరాడుకు కుంకుమే కానీ,
అప్పటివరకు ఎవరో తెలియని మట్టింట్లో మాత్రం ఇల్లాలుగా చిలామణి అవుతుంది.
ఆడది! నవమాసాలు మూసి, పురిటి నొప్పులు ఎన్నో తీసి, పుట్టిన బిడ్డ నవ్వు చూడగానే అన్నీ మర్చిపోతుంది,.......
మగువల అందరికీ ఇదే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 🙏