...

13 views

నువ్వు లేని మేము...
విజ్జమ్మా..
నన్ను నువ్వు మర్చిపోయావో గుర్తుపెట్టుకున్నావో తెలియదు అసలు. కానీ గ్రూప్ మొదలైన కొత్తల్లో నేను నిన్ను ఇలాగే పిలిచేదాన్ని.
నాతో నీకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ నీకు నాకు తెలియకుండానే నువ్వు నాకు దగ్గరయ్యావ్ చాలా.
నీ మాటలు..నీ అల్లరి..నీ డ్రెస్సింగ్ స్టైల్..నీ స్మైల్..నీ కాన్ఫిడెన్స్.. నువ్వు తయారు చేసే బొమ్మలు..స్నేహితులకు నువ్విచ్చే బహుమతులు..అన్నింటికీ మించి స్నేహానికి నువ్విచ్చే విలువ.... ఇవన్నీ నాకు తెలియకుండానే నీ మీద నాకు గౌరవాన్ని.. అభిమానాన్ని.. ఇష్టాన్ని.. ప్రేమను పెంచాయి.
నీకు తెలియకుండానే నువ్వు చాలాసార్లు నాకు ఇన్స్పిరేషన్ అయ్యావ్.
నీకు స్నేహితురాలిగా దగ్గరై..నువ్ చేసిన ఉలన్ బొమ్మలు నీ చేతే బహుమతిగా పొందాలనుకున్నా. కానీ దైవం నాకు నీకు దగ్గరి స్నేహితురాలినయ్యే భాగ్యాన్ని ఇవ్వలేదు.
అయినా.. నువ్వు హైదరాబాద్ వచ్చినా.. ఇంకెటైనా వెళ్లినా గ్రూపులో చెప్పి వెళ్లే దానివి. మరి అలాంటిది ఈ లోకాన్నే వదిలివెళ్తున్నప్పుడు ఎవరికీ చెప్పాలనిపించలేదా విజ్జమ్మా...
నిన్ను దూరం చేసి ఎంత అన్యాయం చేశాడు ఆ భగవంతుడు మాకు...ఎంత క్షోభ పెడుతున్నాడు అందరినీ.
అంతా అయిపోయింది..
ఇప్పుడిక నిన్ను తల్చుకోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయురాలిని..
ఇదే నీకు నా అశ్రునివాళి..
ఎంతోమందికి స్నేహాన్ని పంచి...ఆనందాన్ని నింపిన మా విజ్జమ్మ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ...

-నక్షత్ర
© Nakshathra