"మాటే వినదుగా..!"
"తానొక ముగిసిన అధ్యాయమే కదా..!"
అని నా మది హెచ్చరిస్తుంటే,
"ఆ ముగిసిన అధ్యాయంలో అక్షరాలు మాత్రం ఎప్పటికీ సజీవమే కదా..!"
అంటూ నా ఎద సమర్థించుకుంటుంది.
"గడిచిన కాలమొక గతమనుకుని వదిలేయమని"
నా మది హెచ్చరిస్తుంటే,
"ఆ కాలం మిగిల్చిన గతమే రేపటి భవిష్యత్తుకి పాఠమవబోతుందని"
నా ఎద సమర్థించుకుంటుంది.
"వదిలేసిన వాళ్ళని పట్టుకోవాలనుకుంటే నష్టపోతావని"
నా మది హెచ్చరిస్తుంటే,
"పట్టుకున్న వాళ్ళని వదిలేయడం కష్టమవుతుందని"
నా ఎద సమర్థించుకుంటుంది.
"స్వార్థమే రాజ్యమేలుతున్న ఈ లోకంలో ముక్కుసూటిగా మెలగడం అవసరమా ?"
అని నా మది హెచ్చరిస్తుంటే,
"ఆ స్వార్ధపు రాజ్యంపై దండెత్తే ఏకైక...