...

9 views

గురువే దైవం...
జాతి గూర్చి చెప్పేనట
జాతిని నిర్మించేనట
జాతికి వెలుగిచ్చేనట
నీ ఖ్యాతి చూసి
జాతిగర్వించేనట

జ్ఞానజ్యోతి పంచేనట
అజ్ఞాన చీకటి తరిమేనట
అందరికీ వెలుగు పంచి
కరిగే కొవ్వొత్తిగా మారేనట

బడిని గుడిగా మార్చేనట
గుడిని బడిగా దిద్దేనట
కులమతాలకతీతుడట
కుత్సితాన్ని ఎరుగడట

ఎవరయ్యా ఎవరు
గురువు అంటే ఎవరు
బాల్యాన్ని బంగారుమయం
చేయు దైవమతడు

© Nakshathra