...

6 views

పున్నమి జాబిలి
కళ్ళు మాట్లాడుతాయని
మాయచేసే నీ కళ్ళు చూసాకే తెలిసింది..!!
పువ్వులు కూడా
నీ పెదాలపై చిరునవ్వులా పూస్తాయని
నీ నవ్వులు చూసాకే తెలిసింది..!!
మదిలో భావాలకు భాష అక్కరలేదని
నీ మనసు చదివాకే తెలిసింది...!!
ఋతువులు మారినా
కాలాలు మారిపోయినా...!
నువ్వెప్పుడూ రాలని-వసివాడని
వెన్నెల వసంతమే అనుకున్నా...
చెరిగిపోని హృదయసంతకమే అనుకున్నా....
నువ్వెప్పుడూ నా మదిలో వెలుగులీనుతూనే ఉంటావు
...............పున్నమి జాబిలివై.......
© Dinesh muddada