...

1 views

naa kavitha
నా అక్షరాలు .. కుదురుగా కనబడే కమనీయ సోయగాలు
నా భావాలు .. అల్లరిగా అల్లుకునే బుట్టబొమ్మలు

నా చేతలు.. నిమిషం విశ్రమించని రాక్షస శ్రామికుల వలే
నా రాతలు . అనుక్షణం స్పందించె నా మనసు ప్రతీకలే

నా మాటలు .. గుండె లోతుల్లోకి దూసుకెళ్లే స్ఫూర్తి బాణాలే
నా ఆటలు.. విద్యార్థుల విజయానికి వినూత్న సోపానాలే

నా నేత్రాలు..భావ వ్యక్తీకరణ కళాకారులు
నా చూపులు...మీ అంతరంగ గూఢచారులు

వెరసి నేను..
కదిలే కాలంతో ..కలబడే పోరాటం
వీడలేని ప్రయత్నం..ఆగలేని ప్రయాణం .