...

13 views

ఎవరో..మరి ఎవరో...
నింగి ముంగిలి మీద చుక్కలుపెట్టి
ముగ్గు వేయడం మర్చిపోయారు
ఎవరో...

నిర్జీవంలా కనిపించే మోడు కి
ఆకుపచ్చని ఆకులని
రంగుల పూలని అతికించారు
ఎవరో...

కాలం కాలు కందిపోకుండా
కాళ్ళకి చక్రాలు కట్టి మరీ
కనిపించని తాడుతో లాక్కెళుతున్నారు
ఎవరో...

కమ్మని కలలో కిలకిల నవ్వుతుంటే
కలలో బ్రతకడం కూడదంటూ
కళ్ళు తెరిపించారు
ఎవరో...

నక్షత్ర
© Nakshathra