...

2 views

క్షమించు ప్రియతమా...
నా మాటే నెగ్గించుకున్నా ప్రతీసారి
నేను చెప్పింది వినడం తప్ప
తనకు చెప్పే అవకాశమే ఇవ్వలేదు ఎన్నడూ
ఇప్పుడు ఎంత బాధపడి ఏం ప్రయోజనం
ఎన్నెన్ని ఊసులు చెప్పుకున్నం
ఎక్కడెక్కడో తిరిగినం
విడిపోవద్దనే బాసలు చేసుకున్నం
నా వల్లే జరిగింది అంతా...
పదేళ్ళు తనతోనే ఉన్నా
అర్ధం చేసుకోలేకపోయా తన మనసుని
ఎవర్నో పెళ్లిచేసుకోడానికీ నేనే కారణమయ్యా
తన కన్నీళ్ల వల్లే ఇపుడు నాకీ కష్టాలు
ఏడిపించకుండా అర్ధంచేసుకుని ఉంటే బాగుండు
ఇపుడు నాతోనే ఉండేది
సంతోషాన్ని పంచేది
ఏం చేయగలను
జరిగిపోయిన కాలాన్ని కరిగి పోయే కన్నీటితో తుడిచేయడం తప్ప...


© Nakshathra