...

1 views

కల అనుకోన
కల అనుకోన
నువ్వే ఎదురైన
క్షణాలలో గడిచిన
మన అనే కథ ఒకటి చెప్పుకోన
మది పొరల్లో నిండిన
జ్ఞాపకాల జల్లులో ముడివేసిన
పరిచయమే మన బంధమనుకోన
ఇదంతా కేవలం కల అనుకోన
అంతరాన నిండిన కోపమే ముఖ్యమాయన
చెలిమిలోని పలుకులు మరుపాయన
కురిపించలేని ఆనందాలే కరువాయన
కలిసిరాని కాలాలే తలరాతలాయన
ఓ చెంచలా... నను గమనించవే నేడైన
కల అనుకోన
నువ్వే ఎదురైన
క్షణాలలో గడిచిన
మన అనే కథ ఒకటి చెప్పుకోన
ఓ ప్రియతమా ...
నాది కాని పుస్తకం చదివిన
నిన్ను మరువలేని ప్రేమ కథ చూచిన
గుండె లోతుల్లో సజీవ సాక్ష్యం నేనా
హత్తుకోలేని నీడలా మిగిలాన
చనువు ఇచ్చిన హృదయం ఇదేనా
బంధమనుకున్న బాధ చూపిన
దూరం పెంచి పోషించిన
తెలుసుకోలేని నటన నీడై కానొచ్చినా
నా ప్రేమ విషమవ్వదులే సఖుడా...
కల అనుకోన
నువ్వే ఎదురైన
క్షణాలలో గడిచిన
మన అనే కథ ఒకటి చెప్పుకోన

© Manju Preetham Kuntamukkala