...

1 views

మేఘాలు జరిగినప్పుడు/మొలకలు
మేఘాలు నా జీవితంలో తేలియాడుచున్నవి. మరికొన్ని హృదయాల నిండా నీటిని నింపుకొని ఇక పైవర్షమో, తుఫానో తేడానికి రంగులు మారుస్తున్నాయి. ఊపిరి నన్నొదిలి నీలా వెళ్లిపోయిందని కన్నీరయ్యింది యెదలోని గాయం వెలుగు రానియక సూర్యుణ్ణి కప్పేసి చీకటి బాధలను వర్షించగా ముసురుకున్నాయి
ఏకమై కరగడానికి ...
*****
ప్రాణజీవాలతో తొణికిసలాడే జీవాలు. నాలోని ఊపిరి పోసుకున్న అక్షరాలు లిఖిస్తున్నాయి ధరణి గర్భిత మొలక భావ సంపూర్ణ సారగర్భిత సారాంశాలు తొలకరి చినుకులకే మొలచిన అంకురాలు వరి మడులలో జనించిన పచ్చని మొలకలు సమస్త మానవాళికి భుక్తులు
సంపంగి బూర✍️