వర్షం ☔️
నైరుతి ఋతుపావనాలతో భారత్ కు చేరిన వర్షం,
ఎండకు మండిన నేలమ్మ ను తడిపేసింది
ఎన్నో సంతోషాలను, పండుగలను తెచ్చిన వర్షం,
ఏరువాక పౌర్ణమి తో రైతన్న కన్నీరు చెరిపేసింది
భూదేవి పై తొలకరి చినుకై చిగురించిన వర్షం,
పల్లె తల్లీ వడి పైడి పంటలతో నింపేసింది
తొలి పండుగ తొలి ఏకాదశి తో మొదలైన వర్షం,
ఆషాడ ఆడబిడ్డ ను అమ్మ దరికి చేర్చింది
గోల్కొండన మొదటి బోనాలను తడిపిన వర్షం,
తెలంగాణ లో ప్రతి ఇంట బోనాలతో దద్దరిల్లింది
నాగుల పంచమి నాగన్నకి పాలు పోసిన వర్షం,
కొత్త కోడలిని శ్రావణ పట్టు తో అత్త వారింటుకి పంపింది
శ్రావణ శుక్రవారం వాయినాలు ఇచ్చిన వర్షం
రాఖీ పౌర్ణమి రాఖీ కట్టడానికి మనతో వొచ్చింది
గణేష్షుడి చందాలు కోసం ఇంటి ఇంటికి తిరిగిన వర్షం,
విగ్నేష్షుడి నిమర్జనన్న ఊరందరితో ఉట్టి కొట్టింది
ఈన్ని ఆనందలను తెచ్చిన ఈ వర్షం,
గోదావరి వరద ముంపు ప్రాంతాలను మాత్రం ముంచేసింది
గోదావరి నది, హుస్సేన్ సాగర్, శ్రీ రామ్ సాగర్, నిజాం సాగర్, ఇంకా ఎన్నో నదుల ప్రమాద హెచ్చరిక ను దాటినా వర్షం,
భద్రాద్రి రామన్న పైకే ముంచుకొచ్చింది
మూసి నది ప్రవాహాని పెంచిన వర్షం,
భాగ్యనగర రోడ్ ల నే బయపెట్టింది
ఈ వర్షం దాటికి బజ్జిలు తింటూ కూర్చున్న వారు కొందరు అయితే,
ఇంట్లో నిండిన నీళ్లతో బికు భికుమంటూ కూర్చునా వారు కొందరు.
మళ్ళ ఏడాది ఎలాంటి అతివృష్టి ఉండొద్దు అని ఆశిస్తూ...........
సెలవు
© sravani writtings