...

7 views

Education vs Corruption
చదువు సంస్కారం నేర్పుతుంది అని అంటారు,
విలువలను వివరిస్తుంది అని అంటారు,
నైతికతను నేర్పుతుంది అనీ అంటారు,
కానీ ప్రస్తుత సమాజం చదువును
వ్యాపారంగా మార్చేస్తుంది!
సంస్కారానికి బదులు సందేహపూరిత
ఆలోచనలు నేర్పుతున్నారు!
విలువలకు బదులు వివక్షతను వివరిస్తున్నారు!
నైతికతకు బదులు నేరపూరిత పనులు నేర్పుతున్నారు!
పూర్వం చదువు అంటే సమాజంలో ఉన్న వివక్షతను పోగొడుతుంది అనేవారు!
కానీ ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులకు కూడా,
స్నేహానికి కులం అనే బంధంతో జత పరుస్తోంది!
కాలంతో పాటు మనుషులు మారాలని
విద్యను అందించారు!
కాని కొన్ని మానవ మృగాలు విద్యను వ్యాపారంగా మార్చి వివేకానికి,విచక్షణకు భేదం లేకుండా చేస్తున్నారు!
విద్యకు విజ్ఞానాన్ని జతచేసి వైవిధ్యాన్ని సృష్టిస్తావో?లేక
విద్యకు వివక్షతను తోడు చేసి విధ్వంసం సృష్టిస్తావో నీ ఇష్టం ఓ నా చెలిమి!!!
@manasa
.
.
.
© All Rights Reserved