...

9 views

మలుచుకో నేస్తమా!!!
కాలానికి పరిమితులు ఉన్నప్పటికీ,
మన ఆశలకు,ఊహలకు ఉండవు.
గమ్యానికి దారులు ఉన్నప్పటికీ,
వాటిని చేరుకోవడానికి మనోస్థైర్యం ఉండదు.
బాధను చెప్పుకునే మనసు ఉన్నప్పటికీ,
ఆ బాధను పంచుకునే మనిషి ఉండరు.
అవధులులేని ప్రపంచంలో అవరోధాలు ఉన్నప్పటికీ,
వాటిని అదిగమించే ధైర్యం ఉండదు.
"కాబట్టి ఇలాంటి సమాజంలో ఉన్న మనము ఊహాగానాలకు,ఆశా లోకానికి దూరంగా,మనోస్థైర్యంతో ముందుకు వెళ్తు,బాధను పంచుకునే తోడును ఏర్పరచుకుని,ధైర్యానికి సంకల్పాన్ని జత పరుచుకుని నిన్ను నువ్వు మలుచుకునే శిల్పిలా మారుతావనీ...,,,!!!!"
ప్రేమతో,
© manu