కరిగిపోయే కాంతా..
నిశీధిని దుప్పటిగా మలుచుకొని నిదరోయే నింగిలో ఒక అందాల జాబిలి బిక్కు బిక్కుమంటూ భయంగా తొంగి చూస్తుంది.. తనని ముసిరిన మేఘాల నడుమ తానొక యవ్వన కాంతగా అంబుధులు తనని చెరచడానికి వచ్చిన మృగాలుగా తను భయపడుతుంది.. స్త్రీలే కదా అని తారకలను సాయమడిగితే...