...

6 views

నీ.... నేను
బ్రహ్మ మనసులో ఎటువంటి
స్వార్దం లేని క్షణాన నిన్ను సృష్టించాడనుకుంటా...
అప్సరసలే అసూయపడేంత
అందాన్ని నీకు ఇచ్చాడు...

చల్లటి గాలి పొలం గట్ల పై
నుంచి పరవళ్ళు తొక్కేటపుడు
పైరు ఎంతగా పరవశిస్తుందో...
నీ చిరునవ్వులు నా మనసుని
తాకిన ప్రతిసారి
అదే అనుభవం

నీకు ఒక విషయం చెప్పనా
నీవు పాదాలు మోపే
ప్రతిచోటా. నేల నుంచి
నా అరచేతులు మోలుస్తాయి.

నీ పెదవులు పలికే
ప్రతి మాటని నా మనసులో
పెంచుకునె జ్ఞాపకాల
వనంలో అందమైన పువ్వులా దాచుకుంటాను...
కానీ నీ మాటలు
వినని క్షణం కోట్ల గొంతుల
ఆర్తనాదాలతో కిక్కిరిసిన
శూన్యంలా ఉంటుంది నా మనసు..
© Dinesh muddada