...

3 views

కన్నయ్యకీ ప్రేమతో...
కన్నయ్యా అందుకో నా అక్షరనీరాజనం..✍️💕💕

కన్నయ్యా...కాటుక రేఖలతో
నీ రూపానికీ కాపాలా ఉంచాను...దాయలేదు నిన్ను
అద్దం ముందెన్నడూ..
ఇలా మదిలో తలిచినంతనే
కనుల ముందు
ప్రత్యక్షమవుతావు ప్రేమతో..
అందుకే
నువ్వంటే నాకెంతో ఇష్టం.‌.!!

కన్నయ్యా... నీ చిలిపి మాటలు
వినాలనిపించినపుడూ..
అలా నీ నామస్మరణ చేసేను..
వెనువెంటనే
నీ పిల్లనగ్రోవితో
రసరమ్య గీతాలు
వినిపించేవు ప్రేమతో...
అందుకే
నువ్వంటే నాకెంతో ఇష్టం.‌.!!

చిరు నవ్వులతో..
అమృత భావాలను ఒలికిస్తూ
నన్ను నీ ధ్యాస లోనే
"జీవిత ఖైదీని "చేసేసావు ప్రేమతో..
అందుకే
నువ్వంటే నాకెంతో ఇష్టం...!!

అదేమిటో
కన్నయ్యా...
నువ్వు గుండెలనిండా
ఉన్నా కూడా..
గుప్పెడు అక్షరాలతో
అపురూపంగా
పెనవేసుకుంటావు ప్రేమతో..
అందుకే
నువ్వంటే నాకెంతో ఇష్టం.‌.!!