...

2 views

గాలి ప్రేమ
ఎవరు చూసారు గాలిని
నువ్వూ కాదు నేనూ కాదు
ముడుచుకున్న ఆకులును సృజిస్తూ
తనని ప్రదర్శించుకుంది గాలి
తలలు వంచుకున్న కొమ్మలను కదిలిస్తూ
సాగి వెళ్ళిపోయింది గాలి
కనిపించని నీ ప్రేమలా
కానీ దాన్ని నేను చూశాను
కళ్ళతో కాదు మనసుతో
అయినా ఆశ్వాదించలేని పరిస్థితి
అదిప్పుడు నీలో ఉంది
నీతోనే ఉంది
నీతోనే ఉంటుంది
నా భావ రహిత ప్రపంచానికి కొనసాగింపుగా
దాన్నిక నీకే అంకితం ఇస్తున్నా
© director.gopikiran