"బ్రతుకు భారం..!"
"అయినవాళ్లే కానివాళ్లై,
ఆ కానివాల్లు కాటి వాల్లైనప్పుడు...
చుట్టాల ముసుగులో కుట్రలు, కుతంత్రాలు, అన్యాయాలు
స్నేహాల ముసుగులో మోసాలు, దౌర్జన్యాలు, అక్రమాలు మనల్ని ఏలుతున్నప్పుడు...
మనం నమ్ముకున్న సిద్దాంతాలే రాధ్దాంతాలై,
తడిగుడ్డతో మన గొంతును కోస్తున్నప్పుడు...
ఆనాడు చేసిన పుణ్యాలే,
ఈనాడు పాపాలై వెంటాడుతున్నప్పుడు...
సహాయమందించాల్సిన సమాజమే వెక్కిరిస్తుంటే,
నవ్వుతూ పలకరించే నీ తల సిగ్గుతో కిందకి దించినప్పుడు...
కంటికి కనిపించని బాధ్యతేదో,
బరువై నిన్ను కృంగదీస్తున్నప్పుడు...
నీ అక్షరాలు కూడా నీ కన్నీటిని తుడవక
నీ బ్రతుకే భారమైనప్పుడు...
ఆ భారమైన బ్రతుకు బ్రతకలేక,
నీ జీవితాన్నే అకస్మాత్తుగా త్యజించాల్సి వచ్చినపుడు...
ఆ నేరం నీకు ఆశ కల్పించిన నీ ఆలోచనదా ..?
లేక అమ్ముడుపోయిన ఈ లోకానిదా...?"
- Satya Pavan