...

12 views

ఓ వాక్యం రాస్తే...

ఓ వాక్యం రాస్తే సముద్రంలా రాయాలి
దిగేవాడికి ముత్యపుచిప్పలు దొరకాలి
లోతు అర్ధం కావాలి
ఓ వాక్యం రాస్తే శిల్పం చెక్కినట్టు రాయాలి
చూసేవాడికి సజీవంగా కనిపించాలి
పనితనం తెలియాలి
ఓ వాక్యం ఎంత సుందరంగా ఉండాలి అంటే
ప్రకృతి అంత రమణీయంగానూ,
ప్రేయసి అంత ప్రేమాస్పదంగానూ...!
ఓ వాక్యం పరిపుష్టంగా ఉండాలి
అది గుండెను తాకి
మనసును చేరాలి!
ఒక్కో వాక్యం మనం ఇలా రాయాల్సి ఉంటుంది-
కళ్ళలో రావాల్సిన తడి
మనసులో పొంగాలి!
అదీ వాక్యం అంటే!!
వాక్యం ఎల్లప్పుడూ వర్ణశోభితంగానూ,సంగీతమయంగానూ ఉండఖ్ఖర్లేదు!
కానీ అందులో నీ ఆత్మ ఉండాలి
నువ్వు వాక్యం రాసాక కూడా
అక్షరాల్లో నీ ఆత్మ లోలోతుల్లోంచి చలిస్తుండాలి!
అపుడు,
అదీ వాక్యమవుతుంది!
నీ వాక్యమవుతుంది!!
-----
© Dinesh muddada