...

1 views

ఓ విధి వంచితుడిని
కొన్ని సార్లు చివరి అంచుల్లో!
నువ్వు వదిలి వెళ్లిన గుర్తులు
నా మరణం వరకు వెంటాడతాయి
ఇది వొట్టి గాలి తిత్తు
నీ ప్రేమ లో అమరత్వం పొందిన వాడిని...
నా చేయి వదిలి,
కనిపించకుండా పోయిన,
యుగాలు దిగంతాలకు చేరాయి...
నా చేతకానితనం పై ఉమ్మేసి
ఆకాశం అయ్యావు..
నేను మాత్రం భూమి పై శిలనై,
శిక్ష నీ అనుభవిస్తూ కడ తేరుతాను....
ఎప్పటికీ క్షమించబడని
ఓ విది వంచితుడిని...
© Dinesh muddada