...

2 views

ఇచ్చట అందరూ నట సార్వభౌములేనోయ్....!!
తప్పులు మాత్రమే తప్పక లెక్కించే సమాజం లో ఉన్నాం మనం.. ఇక్కడ
నా వాళ్ళు, నాఓల్లు అనేవారేవరూ ఉండరు.. అంతా స్వార్థం తెర చాటున గిరి గీసుకున్న చరాచర జీవులే తప్ప, "మన" అనుకునే మనుషులే లేరు.ఒక్కటి మాత్రం నిజం నిన్ను నిన్నుగా గుర్తించేది నీ జీవయాత్ర ముగిసినాకనే, ఇక ఈ లోకంలో ఇక నీవు లేవని తెలిసాకనే.అప్పుడే వారి హృదయ కవటాల్లో దాగిన భావాలకు ఊపిరి వస్తుంది, అప్పుడే నీ మీద ప్రేమ నిలువెత్తు రూపమై ఘోషిస్తుందీ..కానీ పాపం అది చూడటానికే నీవుండవు..అందుకే బ్రతికుంటే తిడతారురో సచ్చాక గొప్పోనివంటారురో..
© Dinesh muddada