...

2 views

గెలిచేదాక ఓర్పు...
ఓడిన వాణ్ణి చూడు
ఓడించిన వాణ్ణి చూడు
గెలిచిన వాణ్ణి చూడు
గేలిచేసిన వాణ్ని కూడా చూడు
శత్రువుని చూడు
మిత్రుణ్ణి చూడు
మిత్రునివలె నటించే శత్రువునీ చూడు
వీలయితే గెలువు
ఓడితే కసి పెంచుకుని
ఓటమిని గెలువు
స్వీకరించే మనస్సు చాలు
నీవు గెలవడానికి
గెలిచేదాక ఓర్పు ఉంటే చాలు
నీవు గెలవడానికి
ఐదు మార్లు సివిల్స్కు రాసి ఆరవసారి
గెలిచినవాళ్ళు ఉన్నారు
ఒక్క విషయం తెలుసా
ఓటమి కూడా గెలుపే
అది లేకుంటే
నీకు కసి ఎలా సాధ్యం
సో ఓటమి నీదే గెలుపూ నీదే!




© someshwar daram