...

3 views

ప్రియతమా
ఒక చోటు నీకై లోటు లేనంతగా
పరచుకొని చూస్తున్నది
నువ్వే లోకమంతా భావించి నీకై ఉన్నానని చెప్పకనే చెపుతూ
నీ ఊసే తన శ్వసంటూ కదలికల్ని కనబరచకుండా
దాచుకున్నది నీ రాకతో
జీవం తిరిగొస్తుందని అంతరించని ఆశతో
కాపురం చేస్తూ మది గుప్పిట్లో ఆదమరచి నువ్విచ్చిన జ్ఞాపకాలే చాలంటు
పదే పదే గుర్తుచేసుకుంటూ
చిన్ని పెదవిలో నవ్వు కురిపిస్తూ
జాలువారిన నా ప్రేమ ఎంతని పలుకను నీ పైన నేడు ఓ ప్రియతమా..
© Manju Preetham Kuntamukkala