...

8 views

గణతంత్రం
ఎందరి కలల కిరణము
ఈ గణతంత్రం
ఎందరి కలల తీరము
ఈ గణతంత్రం
ఎందరి గళాల గేయము
ఈ గణతంత్రం
ఎందరి కన్నీళ్ళ త్యాగము
ఈ గణతంత్రం
ఎందరి ఆలోచనల ఆమోదము
ఈ గణతంత్రం
ఎందరి ఆవేశాల ఆవిష్కరణo
ఈ గణతంత్రం
ఎందరి ఆశల ఫలము
ఈ గణతంత్రం
ఎందరిదో ఎందరిదో అంటూ
స్వతంత్ర పోరాట త్యాగమూర్తులను
అందరిలో ఒకడిలా కీర్తించడంతోనే ఆపకు
అరచేతికి అందించిన విలువైన రాజ్యాంగాన్ని
కన్నుల్లో పెట్టుకొని హృదయంలో దాచుకొని కాపాడుకో
ప్రతిక్షణం రాజ్యాంగం పట్ల బాధ్యతగా నడుచుకో
© Dinesh muddada