...

13 views

తీరం
కాలం గాలం వేసి నా కాలిని
అలల ఒడ్డుకి లాగుతుంటే...
నడి సంద్రంలో అలలాడుతూ
నిన్నటి నీ కోసం నే నిరీక్షిస్తున్నాను...
నీటి మీద బుడగలా
ఒక్క క్షణమైనా నీలో
ప్రేమ కానరాకుంది...
పగటి పూట కాసే
వెన్నెలలానా ప్రేమ
నిలువనంటుంది...
© All Rights Reserved