...

2 views

ప్రేమా ❤️
ఈ ప్రపంచంలో అన్నిటి కంటే ఏది గొప్పది??
డబ్బు,ఆస్తి,పేరు,ప్రతిష్ట, హోదా...ఇవేమి కాదు "ప్రేమ"
ఒక మనిషి పేరు కోసం,డబ్బు కోసం కొన్ని సార్లు ఎంతటి కైన దిగజరతాడు. కానీ ప్రేమ కోసం ఎదైన చేస్తాడు.ఎంతైన వదులుకుంటారు.

ఒక అబ్బాయి,ఒక అమ్మాయి మధ్య కలిగే ఈ ప్రేమ ఎంత విచిత్రమైనది అంటే..
అంతటి గొప్ప రాజైన అక్బర్,తన ప్రేమ కోసం ఎంతో మందిని ఎదిరించి ఒక హిందూ అమ్మాయి అయిన జోదా ని పెళ్ళిచేసుకున్నడు. తన ద్వేషాన్ని ప్రేమ గా మార్చుకున్నాడు. అంతకు ముందు ఉన్న భార్యలలో కనపడని ప్రేమ , జోధా లో కనపడింది.

ఈ ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో,అంతే చేదు గా ఉంటుంది... దీన్ని వల్ల కలిగే బాధ నుంచి తప్పించుకోవడం ఆ కృష్ణుడి వల్ల కూడా కాలేదు.

ఒక సారి రాధ అదిగిందట,"కృష్ణా నేను ఎక్కడ ఉంటాను అని,"దానికి కృష్ణుడు "నాలో ,నా ఆలోచనల్లో,నా ఊహల్లో,నా జ్ఞాపకాలలో,నా ఊపిరిలో...అని చెప్పాడు"
అపుడు రాధ అడిగిందట, కృష్ణా నేను ఎక్కడ లేను అని,అప్పుడు కృష్ణుడు,"నా తలరాతలలో"

రాధ , కృష్ణుడి తో కలిసి జీవించలేనని అర్థంఅయ్యి ఆయన కోసం చనిపోయింది.
అటు రుక్మిణి, కృష్ణుడు మీద తనకి ఎంత ప్రేమ ఉన్న.. కృష్ణుడు కి రాధ మీద ఉన్న ప్రేమ గురించి తెలిసి తను ఎంతగా బాధపడి ఉంటుందో..
ఈ ప్రేమ లో ఉన్న వింత ఇదే..గాయం చేస్తుంది అని తెలిసిన కూడా భరించగలరు.

ప్రేమ తప్పో కాదో నాకు తెలీదు కానీ,ఆ అనుభూతి చాలా బావుంటుంది. ఒకరి మీద ప్రేమ కలగాలి అని అంటే, కాలాలా పాటు ఎదురు చూడాల్సిన అవసరం లేదు.. అది కలగాలంటే ఒక్క నిమిషం చాలు.. వారి కళ్ళు,వారి హృదయం చెప్తుంది❤️
© All Rights Reserved