...

0 views

నిర్ణయం/ మల్లెల పరిమళo/పరిహారం
తప్పు చేస్తే జీవితం తప్పే అవుతుంది...
ఒక్క తప్పుడు నిర్ణయం జీవితాన్ని కప్పివేస్తుంది.. మానవులు నాలుగు రకాల జీవితం జీవిస్తారు,, సంఘర్షణ, సార్వజనిక, నిజీ, గుప్తమైన
ఇందు మనసు మథనంలో నిర్ణయం మనసుదే... మనసు మథనంలో ఇక్కడ విషం మరియు
అమృతం రెండూ ఉంటాయి
****
ప్రతీ పురుషుని జీవితంలో మరువని మధురాలు,
గుభాలించి వెదజల్లే మల్లెల పరిమళాలు..
తల్లి ఒడి
సోదరి రాఖీ
కూతురి నవ్వు
భార్య ప్రేమ.
హృదయ దొంతరలో దాచే జ్ఞాపకాలు..
****
వెదికాను నిన్ను నా కవితలలో
నా నిరంతరం స్పందించే.
జీవితపు హృదయాంతరాలలో దాగిన భావాలన్నీ ముందుకు వచ్చి
వినిపించె నిన్ను నా అక్షరాలలో..
నేనూ నా భావాలు...
****
నీవు నా జ్ఞాపకం
నీవిచ్చిన గాయం
ఒంటరితనం
గతం గాయాన్నీ గుర్తు చేస్తుంటే
నిన్ను కలవడం యాదృచ్ఛికం కాదు,
జీవితాంతం నా ఒంటరితనానికి
నువ్వు పరిహారం...
సంపంగి బూర✍️