...

13 views

హే కృష్ణా...
హే కృష్ణ.....!!!
మురళీ మనోహరా....
బృందావనమాళి
రాదా గోపాల.. జై, జై, జై, జై....

ప్రాణము నీవురా,
ప్రణయమ నీకు రా,
వెన్న లు దాచి,
ప్రేమలు పోసి..
నిలిచానురా
దరిచేరరా..
"హే కృష్ణ...!!! "



నీలమేఘ శ్యామ
నిదురించరారా,,
చంద్రుని వెన్నెల,
సూర్యుని వెలుగులు,
రాతిరి.... మసకలు,
నాలో
నీపై మెరిసేనురా
మాధవా ..!!!!!
"హే కృష్ణా.... "

తరగని అందము,
వాడని సొగసు,
చెదరని రూపము,
నాదిరా ....పృథ్వీ వరా...
"హే కృష్ణా "

నీ హృదయములో
కోరుకుంటిని నాకు స్థానం,
నీ ఇంట్లో వెలుగు దివ్వె నై,
నీ వాకిట్లో ముత్యాల ముగ్గు నై,
నీ పాదాల పారాణి నై,
భాసిల్లాలని
నా చిరు ఆశ..
"హే కృష్ణా.... "


యవ్వనము ఉరకలు వేస్తోంది,
నీ మేనిని తాకే అవకాశం చందనానికి
ఇచ్చినట్లు,

నీ కౌగిట కరగాలని,
నీ పెదవి అమృతం పొందాలని ,
చీకటి రాజ్యం లో రాణీనై
పోవాలని
ఆశలేవో
అల్లుకుంటూ ఉన్నాయి
లో లోపల ,
చెంత చేరి
చేయి పట్ట రా.....
"హే కృష్ణ...!!!

మధనుడితో మనువు
తడిసెనటా.....తనువు,
నీకు నాకు.. అనువు,
అక్కర లేదు పరువు,
నీ ప్రేమే ...కరువు,
.......
"హే కృష్ణ... "
.........

............................by........ govind@.....





© All Rights Reserved