...

3 views

నీకై 💔
నీ కలలను కంటున్నాను!నా కనుపాప మాటున,
నీ పదములు వింటున్నాను!నా మస్తిష్కం లోతున,
నీమాటలు చెప్తున్నాను!నా పెదవుల అంచున,
నీ కొరకై శోదించాను! నా హృదయపు పంచన,
నీ వలపులు చూస్తున్నాను!మబ్బుల దారిన,
నీ పిలుపును వింటున్నాను!కోకిల స్వరమున,
నీ తలపులు కంటున్నాను! చినుకుల చాటున,
నీ నడకను వెతికాను! నా అడుగుల వరసన,
నీ ప్రేమను వేదించాను! నా ప్రేమ ప్రణయాన,
నీ రూపం ఊహించక నా హృదయ రోదన!
నీ కౌగిలి కావ్యానికి నా తనువు ఆలాపన!
నీ అనురాగ ఆప్యాయతకి నా మది నివేదన!
© Dinesh muddada