...

1 views

" కర్ణా..!"




కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు చేతిలో ఓడిన కర్ణుడు చివరిగా దుర్యోధనుడి తో...

" మిత్రమా ...!

సమస్త లోకాలకి వెలుగును ప్రసాదించే నా తండ్రి
ఆ సూర్య భగవానుడు నన్ను చీకట్లో వదిలేశాడు...

పొరపాటుతో నన్ను కన్న నా కన్నతల్లి కుంతీ దేవి అవమానంగా భావించి అనాథను చేసి నన్ను నదిలో వదిలేసింది ....

పెంచిన తల్లి దండ్రులు అతీరధుడు, రాధమ్మ నా వద్ద నిజాన్ని దాచి క్షత్రియుడైన నన్ను సూతుడుగా పెంచారు...

యుద్ద విద్య నేర్పమని గురువు ద్రోణుడు దగ్గరకేళ్తే,
" కులం తక్కువ వాడికి నే నేర్పను పో !" అని గెంటేశాడు...

కులం దాచి, గురువు పరుశరాముడు దగ్గర విద్యనభ్యసిస్తే,
" మోసం చేశావ్ ! " అంటూ నన్ను శపించి పంపించాడు...

సమస్త విద్యలను అభ్యసించే సాక్షాత్తు ఆ బ్రహ్మ ముఖం నుండి పుట్టిన...