...

0 views

లేత చిగురును నలపకండి అలా
అమ్మా నాన్న అన్న ఓ లేత చిగురు అంటే నేను చినపాప ఇది నా కుటుంబం.. బరువుల చింతలు బాధలు లేని చిన్న కుటుంబం.. సంతోషాలే తప్ప ఇక వేరే ఏమీ లేని జీవితాలు.. ప్రతీరోజూ మాకొరకే ఉదయిస్తుంది ప్రతి పువ్వు నాకొరకే వికసిస్తుంది అందమైన లోకంలో నేనో లేత చిగురును.. ప్రొద్దున్నే పనులు చేసుకుని నాన్న, అన్నను నన్ను స్కూల్లో వదిలి డ్యూటీకి వెళ్ళేవాడు అన్న 7, నేను 3 తరగతి.. ఒకరోజు అన్నకు జ్వరం ఒళ్ళు కాలి పోతుంది వేడితో,, అమ్మేడుస్తుంది,అమ్మంటే నాకు చాల ఇష్టం అలా ఏడుస్తే నేను భరించలేను హమ్మయ్యా
నాన్నొచ్చి అన్నను
మా ఊళ్ళో డాక్టర్లు లేరు పక్కూరు వెళ్లాల్సిందే.. అప్పుడే ఆశించాను నేను బాగా చదివి మా ఊరికీ డాక్టర్ అవ్వాలని ఈ మాటని అమ్మానాన్నలు చెబితే వారు ఆనందించారు.. కొంత కాలం గడిచింది. గడిచే కాలానికి కన్నుకొట్టిందేమో పాప కనబడటంలేదు,అంతా వెదికారు, ఎక్కడాలేదు,తెల్లవారింది పాప అన్న ఫ్రెండ్ పరుగెత్తుకుంటూ వచ్చి అరే ప్రకాశ చెల్లి ఆ చెట్టుక్రింద పడివుంది అని చెప్పగానే పరుగులో చేరిపోయారు ఊరి జనాలు ఊపిరి లేని పాపను చూసి ఏడవడాలు ఏముంది అంతా అయిపోయింది.. చిన్నప్రాయంలో లేత హృదయంలో చిగురించిన చిగురాశను.నలిపి,రక్కి, కొరికి తెంపి కాలిక్రింద త్రొక్కేశారు.. లేత ప్రాయాలను చిగురు హృదయాలను చె రపకండి ఎదగనివ్వండి.చిగురాశ చిగురించాక ఏమో ఎవరి జీవితాలను మార్చుతుందో.ఇది అబద్దం కానీ
నిజం...
సంపంగి బూర✍️