...

3 views

నిలబడదు.. కలబడదు..
నిలబడదు .."నిమిషమైనా నువు లేక "..నా మనసు
కలబడదు.. "కుదురుగా ఓ వైపు".. నా చూపు

ఎంతల్లరో ఇంత అని చెప్పలేనంత..
ఏ మాయో.. ఎపుడు కమ్మేసావో తెలీనంత..

నిను చూసేవరకు అర్థం కాలేదు .. భూమ్యయస్కాంతత్వం..
దానికన్నా జిలియన్ రెట్లుంటుందేమో..
నీ ఆకర్షణత్వం..

ఎంత చదివినా..తలకెక్కలేదే.. వేగమూ.. త్వరణమూ..
నిను చూడ, నయనం క్షణానికి పరుగెత్తే మైళ్ళ దూరమే వేగం.. అది తెలియడానికి నువ్వే కారణం..

నిలబడదు నా నయనం ఒక్కవైపూ..
ఈ వైపున నువ్వొస్తావేమోననే ఆశేనేమో..

తడబడదు నా హృదయం ఏ వేళనూ..
ప్రతి వేళా తన స్పందన నువ్వేనని తెలుసునేమో..

అణు బంధం అయోమయంగా అనిపించే..
నీతో అనుబంధం బంధాన్ని అందంగా నిర్వచించే వరకు..

ఎలక్ట్రాన్ రివాల్ప్స్..నాన్సెన్స్ అనిపించే..
నీ పరిభ్రమణం నాలో ప్రేమికుడిని ఆవిష్కరించే వరకు..

నిలవదు నా అడుగు.. నీ వైపు సాగక ఏ క్షణమూ..
కదలదు ఏ ఘడియా..మనసవ్వక నీ వశము..

1996-98 నా శ్రీమతి వెంటబడ్డ జ్ఞాపకాలతో
ఈ రోజు పెన్నీకరించాను..
లక్కీ.. 10.12.2018