ప్రేమ ❤️
© sravani writtings
నువ్వు పరిచయమైన వేల తెలీదు ఈ చిన్న పరిచయం నా వందేళ్ళ జీవితం అవుతుందని
ముఖ పరిచయమే లేని ముఖ పుస్తకంలోని ప్రేమకి తెలీదు
ఇది మూడుముళ్ల పరిణయంగా ముడిపడబోతుందని
నీతో ప్రేమాయణం మొదలుపెట్టినప్పుడు తెలియదు ఇది షడ్రుచులు కలిపిన ఉగాది పచ్చడిలా ఉండబోతుందని
నువ్వు ప్రేమిస్తున్నానని నీ మనసులోని మాట చెప్పినప్పుడు తెలియదు నీ మనసులో నాకు తప్ప ఇంకెవరికి స్తానం లేదని
నా గెలుపులో నాతోపాటు నువ్వు సంతోషపడుతున్నప్పుడు తెలియదు నా ఓటమిలో కూడా నువ్వు ఉంటున్నావని
నేను వేసే ప్రతి ముందడుగులో నువ్వు ధైర్యం చెబుతున్నప్పుడు తెలియదు
నా జీవితానికి నువ్వు సారధివి అవుతున్నావని
నువ్వు కోపంతో మాట్లాడుతున్నప్పుడు తెలీదు నీకు కోపం వెనక కొండంత ప్రేమ ఉందని
నా భయం లో నువ్వు చెయ్యి పట్టుకున్నప్పుడు తెలియదు కట్టకాలే అంతవరకు నన్ను వదలనని మాట ఇస్తున్నావని
నీ కష్టసుఖాలను నాతో పంచుకుంటున్నప్పుడు తెలియదు నీలో సగాన్ని నాతో పంచుకుంటున్నావని
అందరూ నీలా ఉంటారో లేదో తెలీదు నేను సీతనో కాదో తెలీదు కానీ నువ్వు మాత్రం నా రామయ్యవి
ఏడడుగులుగా మారబోతున్న బంధానికి తెలీదు ఏడేడు జన్మలకు ఈ బంధం విడిపోదని
నా తప్పటడుగులను సరిదిద్దుతున్నప్పుడు తెలీదు నాతో వందేళ్ళ ప్రయాణానికి సిద్ధమయ్యావని
ఓయ్ పిల్ల నువ్వేనే నా జీవితానికి అన్నప్పుడు తెలియదు మీ జీవితాన్నే నాకు రాసిచ్చావని
ఈ పదాల పల్లకికి తెలీదు అది నీ ప్రేమ కాలి గోటికి కూడా సరిపోదని