...

4 views

అణగారిన జనం

ప్రాకే వేర్లు ప్రాకుతూనే ఉన్నాయి మట్టిలో
కులాల కంపులు వెంటాడాయి నా జాతిలో
ఏం జంతు జాతిది?
మైలు పడిన భ్రమలు జాతిది

ఒకే మొక్కపూలు రాలుతూనే ఉన్నాయి
నా దేశ నిర్దేశాన్ని మతాల గతకల్లో దించారుగా
ఏం మతలబు సూత్రమిది?
కత్తిరించిన కితాబుల కథనమిది

ఏ దారినో పోయింది మానవత్వం
మిగిలి వున్నది పేదరిక వారసత్వం మాత్రమే
రాసుకున్న రాజ్యాంగం అక్కడే ఆగింది
గుండె చప్పుడిప్పుడు చెదలు పట్టి పోయింది
నీరసం నా ఒంట్లో, నా ఇంట్లో చూస్తుంటే
లోకమంతా పరుచుకున్న పింగాణి తలపొస్తుంది
© ఉత్పలిని📝