...

7 views

కాగితం
లేఖ నీకు వ్రాయబోతే సిగ్గుపడెను కాగితమే!
గుండెలయల అలజడి విని నవ్వేసెను! కాగితమే!

హృదయ నది గలగలలకు జవాబేమి చెప్పాలోయి?!
కలంచాటు కలల పడవ తానయ్యెను! కాగితమే!

కనురెప్పల సవ్వడిలో నీ పేరే దాచినానె!
కనుపాపల కలవరమును పట్టేసెను! కాగితమే!

నీవు వచ్చితీరేవని!చెబుతున్నవి ఈ గాలులు!
పెదవులేల ఒణికేనో!గమనించెను కాగితమే!

ఎదురుచూపుల ఊసులలో! నీవే నా రాణివని!
తరముల తపన తనై! పులకించెను కాగితమే!

నాప్రేమను తెలియజెప్పు భాష ఎలా ఉంటుందోయ్!
నా మనసు గగనమల్లె కనిపించెను కాగితమే!

ఇంకెలాగ వ్రాసేదే? ఓ సొగసరి సఖియా!
మౌనాక్షర తీర్థానికి నడిపించెను కాగితమే!
© Dinesh muddada