...

4 views

Victim by Society


తీరం తెలియని సంద్రపు అలనై,
కడలి అంచు తెంచుకున్న కన్నీటి ధారనై,
రాగం మరచి మూగబోయిన కోయిలనై,
బలమే ఎరుగని బలహీనత చుట్టమై,
నిశిదిలో మసకబారిన కిరణామై,
శూన్యంలో కలిసిన గతన్నై,
సువాసనను విడిచిన గులాబీనై,
జమురాత్రి కమ్ముకున్న కారుమేఘన్నై

కన్నీరు కడలి సంద్రమై పొంగుతున్న ఆ వేళ
రెప్ప వాల్చటమే భారమైన ఆ వేళ
నిశిది నన్ను కమ్ముతున్న వేళ
భాదే వరదై నన్ను ముంచుతున్న వేళ
కలవరమే భుకంపమై తనలో కలుపుకుంటూన్న వేళ
నిరాశల జలపాతం నన్ను చుట్టూ ముడుతున్న వేళ

నలిగిన పగిలిన హృదయంతో,
ఓపిక నశించిన శరీరంతో,
బందికములో చిక్కుకున్న బందినై
మానవత్వం మరచిన రాక్షసులకి
దేహాన్ని అర్పిస్తున్న ఈ వేళ
అత్యాచరం ముద్దాడిన మగువని.

కన్న కలలు గాలిలో కలిసిపోగ,
తోడు నిలవాల్సిన చేతులే నన్ను రాయిగా మార్చిపోగా,
వెలుగునివ్వల్సిన తూర్పు వెక్కిరిస్తూ నవ్వగా,
న్యాయమే అన్యాయమై బలిపశువును చేయగా,

మొరటుతనమే ఆయుధంగా, ఎదురీతే బలంగా
నా ఆశల సమాధి నేను కడుతున్న ఈ వేళ.
© satyaswaroop


#telugu #society #victim #telugukavithalu #selfbelieve #selflove #selfcare