...

4 views

ఆడపిల్ల💓
పుట్టినిల్లు పెంచుకున్న కలల బంగారం
20 ఏళ్లుగా దాచుకున్న ఆ ఇంటి గౌరవం

తండ్రి గుండెపై ఆడుకున్న గుండెచప్పుడు
తల్లి కొంగు పట్టి తిరిగిన ఆ ఇంటి కోట్ల ఆస్తి

పుట్టినింటి కడప దాటని పుత్తడి బొమ్మ
అవ్వబోతుంది మెట్టినింట మెరిసే కుందనపు బొమ్మ

నిన్నటి వరకు తండ్రి వేలు బట్టి వేసింది చిన్నచిన్న అడుగులు
ఈరోజు భర్త వేలు పట్టి వేస్తుంది ఏడు అడుగులు

నాన్న చూపుడు వేలు పట్టి చూసింది లోకాన్ని
భర్త చిటికెన వేలు పట్టుకొని చూడబోతుంది జీవితాన్ని

ఈరోజు దాకా పుట్టింటిన మెరిసిన అల్లరి
రేపటి నుంచి అత్తింటా సంసారాన్ని నడిపే సారధి
© sravani writtings