...

1 views

నవ్వు చూసాక
పండు వెన్నెలలు కోట్లు కొట్లుగా చేరాయి ఈ రేయిలో నీ చిన్ని నవ్వు చూసాక ఒక్కసారిగా భువిలో మెరిసే తారలన్ని చుట్టి నీ వెలుగులకు రుపుదిద్దాలని ఉన్నదే
నింగి నేలను ఏకం చేసి చిన్ని సంద్రాన ముంచి ఇంద్రధనస్సునే అలలుగా చేసి నీకిచ్చి సంబరం చేయాలని ఉన్నది
ఇప్పుడిప్పుడే లోకాన్ని ఊహాగా చేసి నిన్ను చేరి ఆనండమంటే ఇదేనని చెప్పి రెక్కలేసుకొని చుట్టాలని ఉన్నది
ఏమిటో ఏమిటో నాకు నేనే కొత్తగా వింతగా అనిపిస్తున్నా ఎందుకో
ఇదంతా నీ చిలిపి నవ్వు చూసినందుకు ఏమో ...
© Manju Preetham Kuntamukkala