...

8 views

ఎవరు గొప్ప?
ఎవరు గొప్ప?
1)కుటుంబం కోసం ప్రాణాలు ఇచ్చే వాడు గొప్పా?
లేక
దేశాన్నే తన కుటుంబంగా అనుకుని ప్రాణాలు ఇచ్చే సైనికుడు గొప్పా?
2)దేశం కోసం యుద్ధం చేసే సైనికుడు గొప్పా?
లేక
యుద్ధం వస్తే ఇరుదేశాలకు ప్రాణ నష్టం కలుగుతుందని శాంతిని నెలకొల్పే వాడు గొప్పా?
3)మనుషులకు ప్రాణ నష్టం కలుగుతుందని శాంతిని నెలకొల్పే వాడు గొప్పా?
లేక
అసలు ఏ జీవికి హాని కలుగకూడదని కోరుకునేవాడు గొప్పా?

పై ప్రశ్నల్లో సమాధానంగా వరుస క్రమంలో ఒకరిని మించి ఒకరు గొప్పవారు అయ్యివుండొచ్చు.
కానీ అసలు ఏ జీవికి హాని కలుగకూడదని కోరుకునేవాడు గొప్ప కాదు దేవుడు. అందుకే అలాంటి వారైన గౌతమ బుద్ధుణ్ణి, వర్ధమాన మహావీరున్ని, యేసుక్రీస్తు, మహ్మద్ ప్రవక్త లను ఇప్పటికీ మనం పూజిస్తున్నాం, కీర్తిస్తున్నాం.