...

0 views

గొడుగు లాంటి తండ్రి నీడలో
బాధ్యతల బరువులు తొందరగా మేలుకొలుపుతాయి తల్లిదండ్రులను. ఎండకు ఎండుతూ, చలికి వణుకుతూ వర్షంలో తడుస్తూ కుటుంబ కర్తవ్య విధిలో బాధ్యతలను నెరవేరుస్తూ తన సంతానానికి గొడుగై నీడనిస్తూ సూర్యుడిలా ఇంటికి వెలుగునిచ్చే నాన్న ఒక్కడే.. నాన్న సంపదను అనుభవించే గర్వమేలా పిల్లల సంపద నాన్నఅనుభవించి గర్వపడినప్పుడే నిజమైన గర్వం.. తల్లిదండ్రులు కార్చిన చెమట చుక్క విలువ చేయదు బిడ్డలు తీర్చలేని ఋణం.. తమ పిల్లల ముఖాల్లో మెరుపు తెస్తూ తెస్తూ ముఖాల్లో ముడతలు పడ్డాయి,, నన్ను రాయగల సమర్థురాలిని చేసిన వారి గురించి ఏం రాయగలను.. జ్ఞాపకాలు ఉండిపోతాయి జీవించి వాటిని గుర్తు చేసుకోండి అని సమయం అన్నింటినీ తీసుకొని గడిచిపోయింది
నన్ను ఒంటరిని చేసి...
సంపంగి బూర✍️